Wednesday, April 7, 2010

ఇడ్లి పిడకలు

నాకు టిఫిన్స్ లో ఇడ్లి అంటే అస్సలు ఇష్టం లేదు. నాకు గుర్తువున్నప్పటి నుండి నేను ఎప్పుడు ఇడ్లి ఇష్టంగా తినలేదు. ఓ రోజు ఎందుకా అని ఆలోచిస్తే గుర్తు వచ్చింది. మేము చిన్నప్పుడు సెలవులోస్తే చాలు అమ్మమ్మ వాళ్ళ వూళ్ళో వాలిపోఎవాళ్ళం. అక్కడ పల్లెటూళ్ళో టిఫిన్స్ చేసుకు తినే అలవాటు లేదు. అమ్మమ్మ, అత్తా వాళ్ళు మాకు టిఫిన్స్ చేయడానికి చాలా కసరత్తులు చేసేవాళ్ళు. మేము ముగ్గురం. మా మామకు ముగ్గురు. మొత్తం ఆరు మంది పిల్లలం. ఇక పెద్దవాళ్ళు ఇంకో ఆరుగురు. ఇంతమందికి చేయడానికి ఈజీగా ఉంటుందని ఎక్కువగా ఇడ్లి చేసేవాళ్ళు. మీము కుమ్మి పారేయడం చూసి మా మామ ఓసారి సరదాగా 'ఒరేయ్ ఇడ్లి ఎక్కువ తింటే మజ్జుగా ఉంటుందిరా. అదీ దోసలైతే ఎన్నైనా తినచ్చు' అన్నారు. అది ఎందుకనో నా మనసులో బలంగా నాటుకుపోయింది.అలా నాకు ఇడ్లి అంటే ఎంత అయిష్టం ఏర్పడిందంటే అమ్మ ఇంట్లో ఇడ్లి చేస్తే ఆ ఇడ్లి పిండితో దోస వేసి పెట్టేది నా కోసం. ఎప్పుడైనా అలా వీలు కాకనో లేక ఇడ్లి అలవాటు చేద్దామనో ఇడ్లి తినమందా ఆ రోజు నా బాధ, ఉక్రోషం చెప్పలేను. ఓసారి అలాంటి ఉక్రోషంతోనే ఇడ్లి,వేరుచేనిక్కయాల చట్నీ కలిపి,పిసికి నా ఎదురుగా వున్నా గోడకి పిడకలులగా చేసి కొట్టాను. ఆ గోడకి ఓ బెంచి వేసి దాని మీద బియ్యం,కందిపప్పు, గోధుమలు,చెనిక్కాయల మూటలువేసి వున్నందుకు నేను చేసిన నిర్వాకం వంగి చూస్తె కాని కనపడదు. అమ్మ చుస్తే ఏమంటుందో అన్న భయంతో ఖంగారుగా స్కూల్కి వెళ్ళాను. కాసేపటికి ఆ సంగతే మర్చిపోయ. అమ్మ ఇల్లు ఊడుస్తూ నా ఇడ్లి పిడకలు చూసింది.ఇదంత మర్చిపోయి ఇంటికి గెన్తుతూవచ్చిన నాకు అమ్మ చేతిలో ఏమి అయ్యుంటుందో మీరే ఉహించండి. కాని ఇప్పుడు మాత్రం ఇడ్లిలను కూడా వదలకుండా లాగిస్తున్నాను లెండి. సరే మరి ఇప్పటికింతే. రేపు మరిన్ని సంగతులతో ...... సౌజన్య.

No comments:

Post a Comment