అడ్డ పేర్లు అంటే నిక్ నేమ్స్ అన్న మాట. నేను పదవ క్లాస్ వరకు ఒకే స్కూల్ లో చదివా. పదేళ్ళు ఒకే క్లాస్ మేట్స్ అన్న మాట.అందరి గురించి ప్రతి ఒక్కళ్ళకి క్షుణ్ణంగా అందరికి తెలుసు. ఎంత ఆప్యాయంగా ఉంటామో అంతగా కొట్లడేవాళ్ళం. అలా కోట్లదేప్పుడే మా అడ్డ పేర్లు అన్ని బయటికి వస్తాయి. వాటితోనేగా తిట్టుకోనేది మరి. ఒక్కోరికి ఒక అడ్డ పేరు . ఆ పేరుకో చరిత్ర. క్లాస్ లో ఇరవై మందిమి. టెన్ గాళ్స్ , టెన్ బోయ్స్. ఫస్ట్ గాళ్స్ తో మొదలెడదామా !
౧. వసంత - అడ్డ పేరు సంత. పేరు లోనే వుందిగా.
మట్టి బల్లి .ఓసారి ప్లే గ్రౌండ్ లో స్టోన్స్ అన్ని క్లియర్ చేస్తోంటే వసంత కి ఓ మట్టి బల్లి కన్పించింది. ఇక చూడాలి వసంత డాన్సులు. బాగా నవ్వము. ఆ పేరు తనదైపోయింది.పెద్దయ్యాక తనకి అస్తమాను బ్లడ్ ని మార్చాల్సిన రోగమేదో వచ్చిందని తెలిసి చాలా బాధ పడ్డా.
౨.వసుధ - బొద్దుగా గుండ్రంగా వుందని వంకాయ అని అనే వాళ్ళం.నవ్వులరాణి అని ఇంకో పేరు.
ఎప్పుడు చూసినా నవ్వుతూనే వుంటుంది మరి. పిజి అయ్యాక చూసాను తనని మెరుపు తీగలాగా వుంది.
3. SUNITHA - తన ఇంటి పేరు భూతాల. పైగా తనకి రింగుల జుట్టు నుదుటి మీద పడుతూ వుంటుంది.ఇక తన పేరేంటో చెప్పలని అంటారా?
౪. విజయ లక్ష్మి - ఈ అమ్మాయికి పేరెట్టే సీన్ ఎవరికీ లేదు. పరమ గయ్యాళి.వెడల్పాటి పెద్ద కన్నులతోనే భయపెట్టేది.
నేనే విజయక్క అని పెట్టా.
౫.అనంత లక్ష్మి - ఈ అమ్మాయి కి ఏమి పేరు ఉండేదో గుర్తు రావటం లేదే.
౬.చంద్ర కల - బేసిక్ గ గిరి = కొండ ఈమె పేరు. ఇక దాని ముందు ఎమైన తగిలించ వచ్చు. చంద్ర గిరి.యాదగిరి. చీమ గిరి. అలా ఏమైనా . నడక విచిత్రంగా ఉంటుందని రోబోట్ అని కూడా ముద్దు పేరు.
౭. సుని - క్రిస్టియన్ . పేరు శునకము. కనకపు సింహాసనమున సునకమును అనే వేమన పద్యము గొప్పగా చదివినందుకు ఆ బిరుదము.
౯.మాధురి - మాడ్రిడ్ .స్పెయిన్ రాజధాని.
౧౦. ఇక నాకు - ఎప్పుడు లైబ్రరీ లో పది కథలు చ్డువుతున్తానని కథల రాణి అని . చిన్న చిన్న రాళ్ళపై బొమ్మలు చేక్కుతానని జక్కన అని. ఆ జక్కన మీదుగా జట్కా అని ఉండేవి లెండి.
ఇక బోయ్స్ సంగతి. మరోసారి చెప్తాను లెండి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment